మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 17
తెలంగాణ పవర్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఈనెల 19న నెల 19వ తేదీన తలపెట్టిన మహా ధర్నాకు సన్నాహకంగా, మంచిర్యాల సర్కిల్ కార్యాలయ ఆవరణలో సోమవారం పోస్టర్ను విడుదల చేశారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లకు నిబంధనలు వర్తింపజేయాలని, 2026 పీఆర్సీ కమిటీని వేసి అమలు చేయాలని, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లను ప్రైవేటీకరించకూడదని జేఏసీ డిమాండ్ చేస్తోంది.
తెలంగాణ పవర్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఈనెల 19వ తేదీన తలపెట్టిన మహా ధర్నాకు సన్నాహకంగా, మంచిర్యాల సర్కిల్ కార్యాలయ ఆవరణలో సోమవారం పోస్టర్ను విడుదల చేశారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లకు నిబంధనలు వర్తింపజేయాలని, 2026 పీఆర్సీ కమిటీని వేసి అమలు చేయాలని, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లను ప్రైవేటీకరించకూడదని జేఏసీ డిమాండ్ చేస్తోంది.
45 రోజులుగా నిరసనలు
గత 45 రోజులుగా విద్యుత్ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యలపై నల్ల బ్యాడ్జీలు ధరించి, మధ్యాహ్న భోజన విరామ సమయంలో కంపెనీ కార్యాలయం ముందు, జిల్లా కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినప్పటికీ యాజమాన్యం తమ సమస్యల పరిష్కారం విషయంలో మొండి వైఖరి అవలంబిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
చలో విద్యుత్ సౌధకు పిలుపు
యాజమాన్యం స్పందించకపోవడంతో, ఈనెల 19న హైదరాబాద్లోని విద్యుత్ సౌధ వద్ద చలో విద్యుత్ సౌధ పేరుతో మహా ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జేఏసీ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులందరూ అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చింది.
విజయవంతం చేయాలని విజ్ఞప్తి
హైదరాబాద్లో జరిగే ఈ మహా ధర్నాను విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ బొమ్మ సత్తిరెడ్డి, కన్వీనర్ పి. రమేష్, కో-కన్వీనర్లు . రాజశేఖర్, . శరత్ కుమార్, వివిధ అసోసియేషన్లు, యూనియన్ల నాయకులు కోరారు. ఈ ధర్నా ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఉద్యోగులు భావిస్తున్నారు.












