హైదరాబాద్, 2026-06-05
తెగణషయూయకాకుఅలంటిటంవయతఉయఉృతయడయయ.ఈె23వతతషవయపతగపణయ.పభతవతయయడడపషపత,తపయణఉహె.
తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు నాయకులు తెలిపారు. ఈనెల 23వ తేదీ రాత్రి 12 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
రోడ్ల దిగ్బంధనం, చలో ప్రగతి భవన్
24వ తేదీన అన్ని రోడ్లను దిగ్బంధించి నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి, పేద ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే, 25వ తేదీన చలో హైదరాబాద్, చలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ఆటో జేఏసీ గౌరవాధ్యక్షుడు గాజుల ముఖేష్ గౌడ్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
నాయకుల మద్దతు
ఈ నిరసన కార్యక్రమాలకు తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల కార్మిక సంఘాల మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో పలు ఆటో సంఘాల నాయకులు పాల్గొన్నారు.












