అక్షరవేకువ (అక్షరవేకువ) జూలై 16
తెలంగాణ ఉద్యమ కాలంలో క్రియాశీలకంగా పాల్గొన్న ముదిరాజుల సమగ్ర వివరాలను సేకరించాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ నిర్ణయించింది. 1969 ఉద్యమం నుండి 2013 వరకు ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన, గాయపడిన, అంగవైకల్యం చెందిన, జైలుకు వెళ్లిన వారి సమాచారాన్ని సేకరించి, డా. కేశవరావు నేతృత్వంలోని కమిటీకి అందజేయనున్నారు.
తెలంగాణ ఉద్యమ కాలంలో అనేక మంది ముదిరాజులు స్థానికంగా ఉన్న సంఘాల ప్రోత్సాహంతో మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. అనేక ప్రాంతాలలో ర్యాలీలు, వంటావార్పు, సహాపంక్తి భోజనాలు, బతుకమ్మలు, బోనాలు వంటి కార్యక్రమాలు, రాష్ట్ర స్థాయి, జిల్లా, మండల మరియు గ్రామ స్థాయి నిరసన ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది.
1969 ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండి జైలుకు వెళ్లిన వారు, అనేక రకాలుగా త్యాగాలు చేసిన వారు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి సరియైన గౌరవప్రదమైన స్థానాన్ని సమాజంలో కల్పించడం కోసం ఇటీవల డా. కేశవరావు గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించడం జరిగింది.
తెలంగాణ ముదిరాజ్ మహాసభ 1969 ఉద్యమాల్లో పాల్గొన్న మరియు మలిదశ ఉద్యమం 2001 నుండి 2013 వరకు వివిధ దశలలో తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొని ప్రాణాలు అర్పించిన వారి వివరాలు, గాయపడిన వారు, అంగవైకల్యం చెందిన వారు, అరెస్ట్ అయి జైలులో మగ్గిన వారు, అనేక సభలు, సమావేశాలు పెడుతూ ఉద్యమాల్లో పాల్గొన్న వారి సమగ్ర సమాచారాన్ని సేకరించి డా. కేశవరావు గారి నేతృత్వంలో ఉన్న కమిటీకి అందజేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ నిర్ణయించింది.
ఈ సమాచార సేకరణకు గాను డా. బండా ప్రకాష్ (తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు), రిటైర్డ్ ప్రొఫెసర్ నీల రాములు, రిటైర్డ్ ప్రొఫెసర్ దినేష్ కుమార్ మరియు డా. యాకయ్య (సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్) గార్లను నియమించడం జరిగింది. వీరు వివిధ జిల్లాలలో పర్యటించి బాధ్యులను సంప్రదించి త్వరలో సమాచార సేకరణ చేస్తారు. కాబట్టి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు మరియు అన్ని అనుబంధ సంఘాల నాయకులు రాష్ట్ర స్థాయిలో సమాచారాన్ని చేరవేయడానికి వీరికి సహకరించి సమాచారాన్ని అందించవలసిందిగా కోరుచున్నాము.
ఇట్లు,












