Mancherial/Hajipur (అక్షరవేకువ) జూన్ 28
హాజీపూర్ గ్రామంలో నిర్వహించిన వలస పోలియో కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాదావరపు శ్రీలత రామారావు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని తల్లిదండ్రులకు ఆమె పిలుపునిచ్చారు.
హాజీపూర్ మండలం పరిధిలోని హాజీపూర్ గ్రామంలో వలస పోలియో కార్యక్రమం కింద పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాదవరపు శ్రీలత రామారావు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి తల్లిదండ్రులు సహకరించాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పీహెచ్సీ సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు.










