చొప్పదండి మండలంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ఇద్దరు పిల్లలకు వన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా. మర్రి మహేష్ రెడ్డి విద్య, వసతితో పాటు అన్ని సౌకర్యాలు కల్పించి అండగా నిలిచారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా. కొమ్ము అశోక్ యాదవ్, డా. మహేష్ రెడ్డిని సన్మానించారు.
తల్లిదండ్రుల అండ కోల్పోయిన ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు డా. మర్రి మహేష్ రెడ్డి ముందుకు వచ్చారు. వారికి అవసరమైన విద్య, హాస్టల్ వసతితో పాటు ఇతర సౌకర్యాలను సమకూరుస్తున్నారు.
ఈ మానవతా స్పూర్తిని ప్రశంసిస్తూ, డా. కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడుతూ, "మహేష్ రెడ్డి గారి సేవా గుణం అభినందనీయం. సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉండడం అనాథలకు ఆసరా" అని కొనియాడారు. సంఘం తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
డా. మర్రి మహేష్ రెడ్డి మాట్లాడుతూ, "సమాజ సేవ మనందరి బాధ్యత. ఆ పిల్లల చదువు పూర్తయ్యే వరకు అన్ని విధాలా అండగా ఉంటాను" అని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గోమాస ప్రభాకర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.












