Mancherial/Kotapalli (అక్షరవేకువ) జూన్ 28
కోటపల్లి మండలం షెట్పల్లి గ్రామంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మంత్రీ గోపీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు.
షెట్పల్లి గ్రామంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మంత్రీ గోపీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మంత్రీ గోపీకృష్ణ మాట్లాడుతూ, “పోలియో రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత. 0 నుండి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలి. ఎవరూ ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమీప పోలియో కేంద్రానికి వచ్చి తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి” అని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ సైదల అక్షయ్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
0 నుండి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని గ్రామ సర్పంచ్ మంత్రీ గోపీకృష్ణ కోరారు.










