మంచిర్యాల జిల్లా కేంద్రంలో అత్యాధునిక దంత వైద్య సేవలను అందించే లక్ష్యంతో శ్రీ ఆదితి డెంటల్ క్లినిక్ ను బుధవారం ప్రారంభించారు. అనుభవజ్ఞులైన దంత వైద్య నిపుణులు సర్జన్ గిట్ల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ క్లినిక్ కార్యకలాపాలు మొదలయ్యాయి.
60 డివిజన్, శ్రీ గీత భవన్, ఉడిపి హోటల్ ఎదురుగా, బస్టాండ్ ఏరియాలో కొలువై ఉన్న ఈ క్లినిక్, లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన దంత వైద్య సేవలను అందించనుంది. చిరునవ్వులు చిందించే దంత వైద్యం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
క్లినిక్ లో రెండు లేటెస్ట్ మిషన్లతో దంత వైద్యం అందించే ఏర్పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు 20 ఏళ్లుగా మంచిర్యాలలో దంత వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు సుపరిచితులైన డాక్టర్ సందీప్ రెడ్డి, తమ ఆస్పత్రి పునఃప్రారంభాన్ని గొప్పగా చేయనున్నారని పేర్కొన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి కోక్కిరాల సురేఖ, నగర మేయర్ ధరణి మధుకర్ హాజరు కానున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా, బిజెపి కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల మహేష్ గౌడ్, కార్పొరేటర్లు ఆఫ్రిన్ గౌసుద్దీన్, సిబ్బంది కలామ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన క్లినిక్, దంత ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజలకు నాణ్యమైన, సమగ్రమైన దంత వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక పరికరాలు, నిపుణులైన వైద్య బృందంతో అన్ని రకాల దంత సమస్యలకు పరిష్కారాలు అందించడానికి క్లినిక్ సిద్ధంగా ఉంది.











