Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 06
హాజీపూర్ మండలం రాపల్లి స్టేజి వద్ద సోమవారం పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ నిర్వహించి, తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు.
హాజీపూర్ మండలం రాపల్లి స్టేజి వద్ద సోమవారం హాజీపూర్ పోలీస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా, సిఐ రవీందర్, హాజీపూర్ ఎస్సై కిరణ్ కుమార్, సిబ్బంది పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాల నియంత్రణ, రోడ్డు భద్రతా నియమాలు, సీసీటీవీ కెమెరాల ఆవశ్యకత గురించి వివరించారు.











