మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 17
ోోబణుుుూ,ఎ,ణుశువుుూళోూఏుైుు.ణుణోొుుు,ణుబఉఘైెెణుఘఉుణుఅుుెు.
మీ భద్రతే తమ ధ్యేయమని మంచిర్యాల్ డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలుగు చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్లను నగర మేయర్ ధరణి మధుకర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. పట్టణ సుందరీకరణలో భాగంగా గతంలో తొలగించిన ట్రాఫిక్ సిగ్నల్స్ ను పునరుద్ధరించి, నాలుగు ప్రధాన కూడళ్లలో తిరిగి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ట్రాఫిక్ సిగ్నల్ ఉల్లంఘించడం చట్టరీత్యా నేరమని, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని డీసీపీ హెచ్చరించారు. చిన్న తప్పిదం కుటుంబానికి తీరని లోటును కలిగిస్తుందని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను మీరిన వారికి అపరాధ రుసుముతో పాటు జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు. ప్రమాద రహిత పట్టణంగా మంచిర్యాలను తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
మేయర్ ధరణి మధుకర్ మాట్లాడుతూ, మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు అంతర్గత మురుగు కాలువలు, విద్యుత్ సరఫరా, త్రాగునీటి అభివృద్ధి పనులతో పట్టణ రూపురేఖలు మారుస్తున్నట్లు తెలిపారు. ప్రధాన రహదారుల ప్రాముఖ్యతను వివరిస్తూ, వివిధ రాష్ట్రాలకు రాకపోకలు సాగే మార్గాల్లో నాణ్యమైన పనులు పూర్తి చేశామన్నారు. సిగ్నల్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు, యూటర్న్ బోర్డుల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఒకే చోట ఆరు రహదారులు కలిసే ప్రాంతాల్లో ప్రత్యేక ప్రణాళికతో ట్రాఫిక్ నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, పట్టణ సీఐ ప్రమోద్ రావు, ట్రాఫిక్ సీఐ హనాన్, పట్టణ ఎస్ఐలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.












