సంగారెడ్డి, 12 October
సంగారెడ్డి కలెక్టరేట్ సమీపంలో నూతనంగా దావత్ రెస్టారెంట్-2ను సోమవారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన టీజీఐఐసీ మాజీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, రెస్టారెంట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
సంగారెడ్డి కలెక్టరేట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన దావత్ రెస్టారెంట్-2ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసీ మాజీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నాణ్యమైన సేవలు అందిస్తూ వినియోగదారుల ఆదరాభిమానాలు పొందాలని ఆకాంక్షించారు. ఆహార రంగంలో నాణ్యత, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన సంతోష్, 30వ కౌన్సిలర్ మనిషా, రెస్టారెంట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.












