
మంచిర్యాల పట్టణంలో వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు, దినసరి కూలీలు రోడ్లపై నిలబడి పనుల కోసం ఎదురుచూస్తున్నారని, ప్రత్యేక అడ్డా స్థలం లేకపోవడంతో ఎండ, వర్షం, ట్రాఫిక్ రద్దీ మధ్య ఇబ్బందులు పడుతున్నారని హింద్ మజ్దూర్ సభ (హెచ్ఎంఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యల పరిష్కారం కోసం హెచ్ఎంఎస్ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేయర్‌కు వినతిపత్రం సమర్పించారు.



















