వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమీన్ పూర్, బీరంగూడ పరిధిలో జరుగుతున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకుడు, హైకోర్టు అడ్వకేట్ ఐలాపూర్ మాణిక్ యాదవ్ పాల్గొన్నారు. పలు గణేష్ మండపాలను సందర్శించి, గణనాథుడిని దర్శించుకున్నారు.
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమీన్ పూర్, బీరంగూడ పరిధిలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న వివిధ గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకుడు, హైకోర్టు అడ్వకేట్ ఐలాపూర్ మాణిక్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిష్టారెడ్డిపేట్, దుర్గానగర్, వీఆర్సీ, బీఎంఎన్, బీహెచ్ఈఎల్, సూర్యోదయ, ఎస్ఎల్ఎన్-4, గ్రీన్ విడోస్, బ్రమరాంబిక నగర్, కాలనీ మోడీ బిల్డర్స్, శంకర్ గ్రీన్ హోమ్స్, నవ్య రతన్ ప్రైడ్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన వివిధ గణేష్ మండపాల అన్నదాన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని, భక్తులకు వడ్డించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించిన ఐలాపూర్ మాణిక్ యాదవ్, గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, యువత, భక్తులు పాల్గొన్నారు.











