సంగారెడ్డి జిల్లా మండలం హుగ్గెలి గ్రామంలో గ్రామస్థుల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఒక ఆర్ఓ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. విశ్రాంత ఇంజనీర్ నాయికోటి అంజయ్య తన సతీమణి స్వర్గీయ నర్సమ్మ జ్ఞాపకార్థం ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయగా, గ్రామ సర్పంచ్ విమల శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు.
ఆరోగ్య పరిరక్షణలో స్వచ్ఛమైన మంచినీరు కీలక పాత్ర పోషిస్తుందని, గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్, ఎలైట్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకరి విజయేందర్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపల్లిలోని ఎలైట్ ఫ్రెండ్స్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ్ సంయుక్తంగా ఈ ఆర్ఓ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా శంకరి విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తన స్వగ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసిన దాత నాయికోటి అంజయ్య దాతృత్వాన్ని అభినందించారు. స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండటం గ్రామ ప్రజల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎలైట్ కన్వీనర్ జి.వెంకటేశ్వర్లు, లయన్స్ క్లబ్ రీజినల్ చైర్మన్ జి.వెంకన్న, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ నాయికోటి రామప్ప, సభ్యులు టి.అల్లంరెడ్డి, ఏ.లక్ష్మారెడ్డి, గ్రామ సర్పంచ్ విమల శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ మహిపాల్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు, కార్యదర్శి శ్రీనివాస్‌తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.











