హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో గురువారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ త్యాగం, విశ్వాసం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
బక్రీద్ పండుగ సందర్భంగా, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బచ్చు శ్రీధర్‌రావు మాట్లాడుతూ, ఈ పండుగ మానవతా విలువలను, ప్రవక్త ఇబ్రాహీమ్ గారి త్యాగస్ఫూర్తిని గుర్తుచేస్తుందని తెలిపారు.
సమాజంలో సోదరభావం, ప్రేమ, ఐక్యతను పెంపొందించేందుకు ఇటువంటి పండుగలు కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏఎంసీ డైరెక్టర్ మాట్లాడుతూ, సూరారం గ్రామం ముస్లిం జనాభాకు ప్రసిద్ధి చెందిందని, గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా పండుగలు జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. ఆయన మండలంలోని ముస్లింలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బచ్చు బాబురావు, గ్రామశాఖ మాజీ అధ్యక్షులు మొలుగూరి భాస్కర్, ఉపాధ్యక్షులు మాజీ ఇరువాల సాంబయ్య, సీనియర్ నాయకులు భాషబోయిన వీరప్ప, కుర్ర ప్రకాష్ గౌడ్, చల్లూరి వేణు, పొలాటి వేణుగోపాల్ రావు, తిర్మల్ రావు, వేముల రాజు, ఇర్వాల ఛత్రపతి, గోసిక రవి, గోసిక తిరుపతి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.












