మహాత్మా జ్యోతిరావు పూలే సమసమాజ స్థాపనకు చేసిన కృషి, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన, అనగారిన వర్గాల అభ్యున్నతి వంటి ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు అభిప్రాయపడ్డారు. విద్యను సమసమాజ స్థాపనకు ప్రధాన ఆయుధంగా పూలే విశ్వసించారని, ప్రతి ఒక్కరూ విద్య ద్వారా వికాసాన్ని పొందాలని ఆయన సూచించారని తెలిపారు.
పురుషులు చదువుకుంటే వ్యక్తిగత ప్రయోజనం ఉంటుందని, అయితే మహిళలు చదువుకుంటే కుటుంబమంతా లాభపడుతుందని ఉద్బోధించిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు.
బీసీల అభ్యున్నతికి ఆయన చేసిన పోరాటాలు ఎనలేనివని, ఆయన ఆశయ సాధనలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పూలే ఆశయాలను గౌరవిస్తున్నారని, ఆయన మార్గదర్శకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.







