మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా భవన నిర్మాణానికి బుధవారం భూమి పూజ జరిగింది. ఈ నిర్మాణానికి సుద్దుల బ్రదర్స్ భూమిని విరాళంగా అందించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా మహిళా భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో, వెంకటాపూర్ గ్రామంలో సర్పంచ్ సేగ్గం వెంకటేష్ ఆధ్వర్యంలో మహిళా సంఘ సభ్యులు భూమి పూజ నిర్వహించారు. ఈ భవనం గ్రామంలో మహిళల అభివృద్ధికి, వారి కార్యకలాపాలకు ఒక ముఖ్య వేదికగా ఉపయోగపడనుంది.
భూమి పూజ కార్యక్రమంలో మందమర్రి మండల ఎంపీడీవో రాజేశ్వర్, ఏపీవో ఎస్తార్ డేవిడ్, ఏపీఎం చంద్రశేఖర్, పంచాయతీ రాజ్ ఏఈ టీ. రాజలింగు, పంచాయతీ కార్యదర్శి కే. ప్రశాంత్, మహిళా అధ్యక్షురాలు అబ్బోజు సంజన, గ్రామ ఉపసర్పంచ్ సుద్దుల రాజేశ్వరి, వార్డ్ సభ్యులు వేల్పుల మహేశ్వరి, శీలం వెంకటమ్మ పాల్గొన్నారు.
గ్రామ మహిళలు, పెద్దలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని, మహిళా భవన నిర్మాణానికి మద్దతు తెలిపారు. ఈ భవనం ద్వారా మహిళా సాధికారత పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది.
మహిళా భవన నిర్మాణానికి భూమిని విరాళంగా అందించిన సుద్దుల బ్రదర్స్ ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. ఇది గ్రామంలో సామాజిక బాధ్యతకు నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు.












