Bapatla/Ponnur Urban (అక్షరవేకువ) జూలై 24
మండల కేంద్రంలోని కౌట్ల బి గ్రామంలోని నేతాజీ పబ్లిక్ స్కూల్లో శుక్రవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేగుంట గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేషధారణతో అలరించారు.
మండల కేంద్రంలోని కౌట్ల బి గ్రామం నేతాజీ పబ్లిక్ స్కూల్లో శుక్రవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేగుంట గంగాధర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో చిన్నారులు పోతురాజు, బోనాల వేషధారణలో పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించారు. ఆషాఢ మాసం తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన మాసమని, ఈ మాసంలో రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
బోనాలు మహంకాళి అమ్మవారికి కృతజ్ఞతగా సమర్పించే నైవేద్యమని, ‘బోనం’ అంటే భోజనం అని అర్థమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.












