జైపూర్, జులై 28
జైపూర్మండలంపౌనూర్గ్రామపరిధిలోని''భూమికబ్జాకుగురవుతోందన్నఆరోపణలనేపథ్యంలోజైపూర్మండలపరిషత్అభివృద్ధిఅధికారి(MPDO)సత్యనారాయణసోమవారంక్షేత్రస్థాయిలోస్థలాన్నిపరిశీలించారు.ప్రభుత్వభూములపరిరక్షణలోఅధికారులుఅలసత్వంవహించవద్దని,కఠినంగావ్యవహరించాలనిఆయనస్పష్టంచేశారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారులు ఎలాంటి అలసత్వం వహించవద్దని, కఠినంగా వ్యవహరించాలని జైపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) సత్యనారాయణ స్పష్టం చేశారు.
జైపూర్ మండలం పౌనూర్ గ్రామపంచాయతీ పరిధిలోని 'పల్లె ప్రకృతి వనం' భూమి కబ్జాకు గురవుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన సోమవారం క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏంపిడిఓ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రకృతి వనాలకు కేటాయించిన భూమిలో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే వనం చుట్టూ ట్రంచ్ (సరిహద్దు కందకం) తవ్వించాలని, ఖాళీగా ఉన్న భూమిని భద్రపరిచేలా భారీగా మొక్కలు నాటాలని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
పల్లె ప్రకృతి వనాలను పరిరక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.












