భీమారం, 17 September
భీమారం గ్రామపంచాయతీ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో పిల్లల సౌకర్యార్థం స్నానపు గదులు, టాయిలెట్ల నిర్మాణానికి ఎస్బీఎం నిధులతో రూ.21 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. సర్పంచ్ ఉష్క మల్ల విజయలక్ష్మి, పున్నం చందు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
భీమారం గ్రామపంచాయతీ సర్పంచ్ ఉష్క మల్ల విజయలక్ష్మి, పున్నం చందు ఆధ్వర్యంలో అభివృద్ధి పనులలో భాగంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పిల్లల కోసం స్నానపు గదులు, టాయిలెట్ల నిర్మాణానికి ఎస్బీఎం నిధులతో 21 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపన చేశారు. పిల్లలకు అవసరమైన టాయిలెట్లు, స్నానపు గదులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన పాఠశాల హెడ్మాస్టర్, కాంట్రాక్టర్, సెక్రటరీ మల్లేష్, భీమారం ఉపసర్పంచ్ లక్ష్మి, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.












