దళిత జర్నలిస్టుల ఫోరం (డిజెఎఫ్) ఆధ్వర్యంలో లో నిర్వహించనున్న 11వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ను మంత్రి దామోదర రాజనర్సింహ ఆవిష్కరించారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో డీజేఎఫ్ నాయకులు మంత్రిని కలిసి మహాసభలకు ఆహ్వానించారు. పోతిరెడ్డిపల్లి ఎక్స్-రోడ్లోని పీఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ మహాసభలు జరగనున్నాయి.
మంత్రి దామోదర రాజనర్సింహ మహాసభల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి, జిల్లా అధ్యక్షుడు రామని అశోక్ ఆధ్వర్యంలో నాయకులు మంత్రిని కలిసి మహాసభలకు ఆహ్వానించారు. మహాసభల లక్ష్యాలు, నిర్వహణ, డిమాండ్లను మంత్రికి వివరించారు. పోతిరెడ్డిపల్లి ఎక్స్-రోడ్లోని పీఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దళిత జర్నలిస్టుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం కోసం మహాసభల్లో పలు తీర్మానాలు చేయనున్నట్లు నాయకులు పేర్కొన్నారు. దళిత జర్నలిస్టులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, అర్హులందరికీ అక్రిడిటేషన్, ఇళ్ల స్థలాలు, పిల్లలకు ఉచిత విద్య, కుటుంబ సభ్యులకు పరిమితి లేని వైద్య సదుపాయం, ఉచిత బస్, రైలు పాసులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అభయహస్తం కింద రూ.12 లక్షలు, అకాల మరణం చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా, నిరుద్యోగ భృతిగా నెలకు రూ.15 వేలు అందించాలని కోరారు. సీనియర్ దళిత జర్నలిస్టులకు నామినేటెడ్ పదవులతో పాటు ప్రెస్ అకాడమీ చైర్మన్గా, సభ్యులుగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మహాసభలను విజయవంతం చేసేందుకు జర్నలిస్టులు, మేధావులు, ప్రజా సంఘాలు సహకరించాలని డిజెఎఫ్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో డీజేఎఫ్ సలహాదారు మీనంపల్లి కిషన్ రావు, జిల్లా కార్యదర్శి ముక్కగల్ల యాదన్న, జిల్లా ఉపాధ్యక్షుడు దానం మోహన్, కోశాధికారి ఎర్రోళ్ల సంపత్ కుమార్, హెచ్. దాసు తదితరులు పాల్గొన్నారు.











