దాంపూర్, భీమారం, మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 10
భీమారం మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయి వినియోగానికి అలవాటు పడటంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. . హబీబ్ (భీమారం), కృష్ణ ప్రసాద్ (దాంపూర్), వినీత్ (దాంపూర్) లపై భీమారం ఎస్ఐ ఏ రాజేందర్ ఆధ్వర్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. వారిని మంచిర్యాలలోని ప్రభుత్వ డీ-అడిక్షన్ సెంటర్కు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది.
గంజాయికి అలవాటు పడిన ముగ్గురికి డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు భీమారం ఎస్ఐ ఏ రాజేందర్ ఆధ్వర్యంలో భీమారం మండలానికి చెందిన గంజాయి వినియోగానికి అలవాటు పడిన ముగ్గురు వ్యక్తులు Md. హబీబ్ (భీమారం), కృష్ణ ప్రసాద్ (దాంపూర్), వినీత్ (దాంపూర్) లపై భీమారం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని చెన్నూర్ న్యాయస్థానంలో హాజరుపరచగా, మేజిస్ట్రేట్ వారికి కౌన్సెలింగ్ మరియు పునరావాసం కల్పించే ఉద్దేశంతో మంచిర్యాలలోని ప్రభుత్వ డీ-అడిక్షన్ సెంటర్కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే అనర్థాలపై తల్లిదండ్రులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భీమారం ఎస్.ఐ. A. రాజేందర్ తెలిపారు.












