గోమాత ఆరాధన ఉద్యమ ఆహ్వానం కార్యక్రమం ఆధ్వర్యంలో, గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని, గోసేవా మంత్రత్వ శాఖను ఏర్పాటు చేయాలని, గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టారు. ఈ క్రమంలో మంచిర్యాలలో సేకరించిన సంతకాల పత్రాలను తహసీల్దార్ రాఫాతుళ్ళ హుసేన్ కు అందజేశారు.
గో సంరక్షణ జిల్లా ప్రభారి వేముల హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించడం, గోసేవా మంత్రిత్వ శాఖ ఏర్పాటు, గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం వంటి డిమాండ్లతో ప్రజల సంతకాలను సేకరించారు.
సేకరించిన సంతకాల పత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్, దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతికి చేరవేయాలని తహసీల్దార్ ను కోరారు. ఈ విజ్ఞప్తుల ద్వారా గో సంరక్షణకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, గో సంరక్షణ ఆవశ్యకతను ఈ కార్యక్రమం తెలియజేసిందని తెలిపారు. గో ప్రేమికులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.








