మందమర్రి మండలం పొన్నారం గ్రామంలో నల్లెల్లి వినీత్ – శ్రావంతి దంపతుల నూతన 'ఇందిరమ్మ ఇల్లు' గృహప్రవేశ కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై గృహాన్ని ప్రారంభించారు.
ఎంపీ గడ్డం వంశీకృష్ణ నూతన గృహానికి రిబ్బన్ కట్ చేసి, వాస్తు పూజలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఇది నిదర్శనమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
గృహప్రవేశం అనంతరం, గ్రామ సర్పంచ్ పెంచాల మధు 36వ జన్మదినోత్సవ వేడుకల్లో ఎంపీ పాల్గొన్నారు. సర్పంచ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంపీ పర్యటనతో గ్రామంలో సందడి నెలకొంది. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చ జరిగింది.











