హజీపూర్, 11 September
మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో భాగంగా, ప్రధాన పంటలలో సమగ్ర చీడపీడల యాజమాన్య పద్ధతుల ()పై రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ మాట్లాడుతూ, పంటల సాగులో చీడపీడల నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు.
*ఆత్మ ఆధ్వర్యంలో ప్రధాన పంటలలో సమగ్ర చీడపీడల యాజమాన్యంపై రైతులకు అవగాహన* శుక్రవారం రోజున మండలంలోని నర్సింగాపూర్ గ్రామములో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో RPL నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమం లో భాగంగా ప్రధాన పంటలో సమగ్ర చీడపీడల యాజమాన్య పద్ధతులు (IPM) పై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లా వ్యవసాయ అధికారి మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఆత్మ) సురేఖ మాట్లాడుతూ, పత్తిలో చీడపీడల నియంత్రణకు పంట సాగు ప్రారంభం నుంచే క్రమం తప్పకుండా పంటను పరిశీలించడం చాలా ముఖ్యమని తెలిపారు. పురుగు ఉధృతిని గమనించిన వెంటనే మందులు పిచికారీ చేయకుండా, పురుగు స్థాయి ఆర్థిక నష్టం స్థాయి (ETL) దాటినప్పుడు మాత్రమే సిఫారసు చేసిన నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది. పత్తి పంటలో పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు మరియు గులాబి రంగు పురుగు పర్యవేక్షణకు లింగకర్షక బుట్టలు ఏర్పాటు చేసి, పురుగు ఉధృతిని క్రమం తప్పకుండా గమనించాలి. అధిక నత్రజని ఎరువుల వినియోగాన్ని నివారించి సమతుల్య పోషక యాజమాన్యం పాటించాలి. పత్తి పంటలో అవసరమైన చోట పక్షి కూర్చునే కొమ్మలు, జిగురు అట్టలు మరియు లింగాకర్షణ బుట్టలు పర్యవేక్షణ పరికరాలను వినియోగించాలి. పురుగుమందులను విచక్షణారహితంగా పిచికారీ చేయకుండా, ETL ఆధారంగా అవసరమైనప్పుడు మాత్రమే సిఫారసు చేసిన మందులను వినియోగించాలి. పురుగుమందులను లేబుల్‌పై సూచించిన మోతాదులో, సరైన నీటి పరిమాణంతో మరియు సరైన సమయంలో మాత్రమే పిచికారీ చేయాలి. పిచికారీ సమయంలో రైతులు వ్యక్తిగత రక్షణ పరికరాలు ఉపయోగించాలని, వరి పంట లో కాండం తొలిచే పురుగు, ఆకు ముడత పురుగు వంటి ప్రధాన చీడపీడలను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు పంటను క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించారు. అధిక నత్రజని ఎరువుల వినియోగాన్ని నివారించి సమతుల్య ఎరువుల యాజమాన్యం పాటించాలని, అవసరమైన చోట లైట్ ట్రాప్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. పొలంలో సహజ శత్రువులైన సాలీడులు, పరాన్నజీవి కీటకాలను సంరక్షించి, ETL ఆధారంగా మాత్రమే పురుగుమందులను వినియోగించాలని సూచించారు. అధికంగా పురుగుమందులు వినియోగించడం వల్ల సాగు ఖర్చులు పెరగడం, మిత్ర కీటకాలు నశించడం, పురుగుల్లో మందుల నిరోధకత పెరగడం మరియు పర్యావరణ కాలుష్యం వంటి సమస్యలు ఏర్పడతాయని అధికారులు తెలిపారు. అందువల్ల రైతులు సమగ్ర చీడపీడల యాజమాన్య పద్ధతులను పాటించి తక్కువ ఖర్చుతో నాణ్యమైన పత్తి దిగుబడులు సాధించాలని సూచించారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని, కూరగాయలు వేస్తున్న నర్సింగాపూర్ గ్రామం రైతులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: జిల్లా వ్యవసాయ అధికారి మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ ( ఆత్మ) మంచిర్యాల సురేఖ మేడమ్ గారు, ADA మంచిర్యాల మామిడి క్రిష్ణ గారు స్థానిక కార్పొరేటర్ లగిసెట్టి రాజన్న గారు AMC డైరెక్టర్ మనోజ్ గారు వ్యవసాయ అధికారి క్రిష్ణ, AEO లు మదుప, కొమురయ్యా, మౌనిక












