హజీపూర్, 11 September
మండలం నర్సింగాపూర్ గ్రామంలో సహజ వ్యవసాయం మరియు జాతీయ సహజ వ్యవసాయ మిషన్ () కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారి మంచిర్యాల సురేఖ నిర్వహించారు. ఈ సందర్భంగా సహజ వ్యవసాయ పద్ధతులు, బహుళ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు.
*ప్రకృతి వ్యవసాయం & జాతీయ సహజ వ్యవసాయ మిషన్ (NMNF)* నర్సింగాపూర్ గ్రామం మండలం *సహజ వ్యవసాయం & జాతీయ సహజ వ్యవసాయ మిషన్ (NMNF)* కార్యక్రమం ను జిల్లా వ్యవసాయ అధికారి మంచిర్యాల సురేఖ నిర్వహించడం జరిగింది. సహజ వ్యవసాయం పశుపోషణతో అనుసంధానమై ఉంటుంది. ఇందులో బీజామృతం, జీవామృతం, ఘన జీవామృతం, నీమాస్త్రం, దశపర్ణి వంటి పొలంలోనే తయారు చేసే విధానం, బహుళ పంటల సాగు విధానాలు, తెలియచేయడం జరిగింది. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు ఆరుతడి పంటలు ఐన పప్పుదినుసులు, కూరగాయలు, మెట్ట పంటలు ఐన జొన్న పంటలు సాగు చేయాలని, పంటల మార్పిడి సాగు లో ఆయిల్ పామ్ సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. *ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మంచిర్యాల సురేఖ స్థానిక కార్పొరేటర్ లగిసెట్టి రాజన్న AMC డైరెక్టర్ మనోజ్ ADA మంచిర్యాల మామిడి క్రిష్ణ వ్యవసాయ అధికారి క్రిష్ణ AEOs మధుప, కొమురయ్య, మౌనిక కృషి సఖి స్వప్న సేంద్రీయ వ్యవసాయ రైతులు రైతులు పాల్గొన్నరు.












