మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 10
జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ నూతన జంబో కమిటీని గురువారం ఏర్పాటు చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పైడిమల్ల నర్సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎస్సీ సెల్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయి.
జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ జంబో కమిటీ కూర్పు గురువారం జరిగింది. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పైడిమల్ల నర్సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎస్సీ సెల్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు జిల్లా , మండల, గ్రామ కమిటీ ఏర్పాట్లలో భాగంగా జిల్లా అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు గడ్డం వినోద్ సూచన ల మేరకు జిల్లా కమిటీని ఏర్పాటు చేసినట్లు నర్సింగ్ స్పష్టం చేశారు. 11 మంది జనరల్ సెక్రెటరీలుగా 20 సెక్రెటరీలుగా,6 వైస్ చైర్మన్ గా 2 కమిటీ స్పోక్ పర్సనల్గా (అధికార ప్రతినిధి) లు గా ఎంపిక చేసినట్లు నర్సింగ్ వెల్లడించారు. కమిటీ మొత్తం ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లో బలంగా తీసుకెళ్లి పార్టీని వచ్చే ఎన్నికల్లో విజయం వైపు నడిపించే విధంగా తమ కృషి ఉంటుందని నర్సింగ్ ఈ సందర్భంగా చెప్పారు.












