మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 21
లైన్స్ క్లబ్ మంచిర్యాల, లైన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత కంటి పరీక్ష శిబిరంలో ఎంపికైన 30 మందికి కరీంనగర్లోని రేకుర్తి కంటి ఆసుపత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్సలు పూర్తయ్యాయి. ఈరోజు వారిని స్వస్థలాలకు పంపించారు.
లైన్స్ క్లబ్ మంచిర్యాల, లైన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత కంటి పరీక్ష శిబిరంలో ఎంపికైన 30 మందికి లైన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని రేకుర్తి కంటి ఆసుపత్రిలో అన్ని వసతులతో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈరోజు ఆపరేషన్ చేయించుకున్న వారిని స్వస్థలాలకు పంపించే కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంధత్వ నివారణకు నిరంతర సేవలు
ఈ సందర్భంగా ప్రోగ్రాం చైర్పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, లైన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా కంటి పరీక్ష శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో తెల్ల రేషన్ కార్డు కలిగినవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఆపరేషన్ చేయించుకున్న వారికి పండ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి. వెంకటేశ్వర్లు, కోశాధికారి కే. వెంకటేశ్వరరావు, ప్రోగ్రాం చైర్ పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి, గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు లయన్ డాక్టర్ నరేష్, కోశాధికారి లయన్ జట్టిలత, ఎం. వెంకటేశ్వర్లు, సీనియర్ లైన్ సభ్యులు లయన్ డాక్టర్ కే. సుగుణాకర్ రెడ్డి, ఎం. రామాంజనేయులు, ఏ. రాజేశ్వరరావు, లయన్ కారకూరి చంద్రమౌళి, లయన్ పి. ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.












