మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 31
మంచిర్యాల పట్టణంలో నంబర్ ప్లేట్లు లేకుండా, అస్పష్టంగా ఉన్న లేదా టాంపరింగ్ చేసిన నంబర్ ప్లేట్లతో వాహనాలు నడుపుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో భాగంగా 12 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయగా, 40 వాహనాలకు జరిమానాలు విధించారు.
మంచిర్యాల పట్టణంలో నంబర్ ప్లేట్లు లేకుండా, అస్పష్టమైన నంబర్ ప్లేట్లతో లేదా నంబర్ ప్లేట్లను టాంపరింగ్ చేసి వాహనాలు నడుపుతున్న వారిపై మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 12 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడంతో పాటు, 40 వాహనాలకు జరిమానాలు విధించారు.
పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం (31-08-2026) మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హనన్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నంబర్ ప్లేట్లు లేకుండా, నంబర్లు స్పష్టంగా కనిపించకుండా లేదా నంబర్ ప్లేట్లను టాంపరింగ్ చేసి వాహనాలు నడుపుతున్న పలువురు వాహనదారులను గుర్తించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ హనన్ మాట్లాడుతూ, వాహనదారులందరూ ఆర్టీఏ నిబంధనల ప్రకారం తమ వాహనాలకు స్పష్టంగా కనిపించే నంబర్ ప్లేట్లను తప్పనిసరిగా అమర్చుకోవాలని సూచించారు. నంబర్ ప్లేట్లు లేకపోవడం లేదా నంబర్లు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, అలాగే ఏదైనా నేరం జరిగిన సందర్భంలో సంబంధిత వాహనాలను గుర్తించడం, నిందితులను గుర్తించడం కష్టతరంగా మారుతుందని తెలిపారు.
ఇకపై కూడా నంబర్ ప్లేట్ల నిబంధనలపై ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను సీజ్ చేయడంతో పాటు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, రోడ్డు భద్రతకు సహకరించాలని ట్రాఫిక్ సీఐ కోరారు.












