సంగారెడ్డి, 9 September
సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) గోవింద్ రామ్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు బుధవారం పట్టుబడ్డారు. ఒక ప్రైవేట్ కళాశాల వ్యవహారంలో రూ. 20,000 నగదు లంచం అందుకుంటుండగా ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.
సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ ఓ ప్రైవేట్ కళాశాలకు సంబంధించిన వ్యవహారంలో 20వేల నగదు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. కళాశాలకు సంబంధించిన పనిని పూర్తి చేసేందుకు అధికారి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అధికారులు పక్కా ప్రణాళికతో బుధవారం మధ్యాహ్నం వల పన్నారు. అధికారి నగదు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనతో సంగారెడ్డి కలెక్టరేట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు, సంబంధిత పత్రాలను పరిశీలిస్తూ తదుపరి చర్యలు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు ఏసీబీ అధికారుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.












