నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో గౌడ కులస్తుల ఆరాధ్యదైవమైన శ్రీ రేణుకా మాత ఎల్లమ్మ ఐదు రోజులపాటు జరిగే బోనాలు సోమవారం రోజున ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, పూజలు నిర్వహించారు.
సోమవారం ఉదయం మహిళా గౌడ కులస్తులు మంగళ హారతులతో పుట్ట బంగారం వద్ద పూజలు చేశారు. ఎల్లమ్మ గుడి వద్ద కథా కార్యక్రమం అనంతరం, పోతరాజుల విన్యాసాలు, డోలు నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఎల్లమ్మ వేషధారణలో కనిపించిన కళాకారులు, పోతరాజులు చేసిన విన్యాసాలు ప్రజలను ఎంతగానో అలరించాయి. గౌడ కులస్తులు, గ్రామస్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
లంద వద్ద ఎల్లమ్మ కాడ కథలు చెప్పడం జరిగింది. చివరి రోజున మహిళలు మంగళారతులు తీసుకొని, ఎల్లమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ బోనాలు గౌడ కులస్తుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించాయి.
బోనాల ఉత్సవాల ముగింపు సందర్భంగా, గౌడ కులస్తుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.











