Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 18
హాజీపూర్ మండలం పరిధిలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి శుక్రవారం 440 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు నీటిమట్టం, నిల్వ సామర్థ్యం వివరాలను అధికారులు వెల్లడించారు.
హాజీపూర్ మండలం, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి శుక్రవారం 440 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా, ప్రస్తుతం 142.20 మీటర్లకు నీరు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 20.1754 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7.7255 టీఎంసీల నీరు నిల్వ ఉంది. హైదరాబాద్ మెట్రో వాటర్ స్కీముకు 320 క్యూసెక్కులు, ఎన్టిపిసి అవసరాలకు 120 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు.












