హజీపూర్, 2026-06-05
హాజీపూర్ మండలం నాగారంలో ఇటీవల లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రహదారి పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. రహదారికి ఇరువైపులా మట్టిని నింపడం గుత్తేదారు మరిచిపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హాజీపూర్ మండలం నాగారంలో ఇటీవల లక్షలాది రూపాయలు వెచ్చించి నూతనంగా నిర్మించిన సిమెంట్ రహదారి పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. రహదారికి ఇరువైపులా మట్టిని నింపడం గుత్తేదారు మరిచిపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రమాదాలకు ఆస్కారం
రెండు వైపుల నుంచి వాహనాలు, ఎడ్లబండ్లు ఎదురుపడినప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు రోడ్డు దాటి ఇళ్లలోకి వెళ్లే సమయంలో కింద పడి గాయాల పాలవుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి రహదారికి ఇరువైపులా మట్టిని నింపి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.












