Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 13
హాజీపూర్ మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ముల్కల్ల క్వారీ నుంచి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. ఇసుకను లోడ్ చేసిన తర్వాత పరదాలు కప్పకుండానే బహిరంగంగా తరలిస్తుండటంతో, గాలికి ఎగిరే ఇసుక రేణువులు వాహనదారుల కళ్ళల్లో పడుతున్నాయి.
హాజీపూర్ మండలంలోని ముల్కల్ల క్వారీ నుంచి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ల యజమానులు కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇసుకను లోడు చేసిన తర్వాత దానిపై ఎలాంటి పరదాలు (టార్పాలిన్లు) కప్పకుండానే బహిరంగంగా ప్రధాన రహదారులపై రవాణా చేస్తున్నారు.
ట్రాక్టర్లపై పరదాలు కప్పకపోవడం వల్ల ప్రయాణ సమయంలో గాలికి ఇసుక రేణువులు వెనుక వచ్చే వాహనదారుల కళ్ళల్లో పడుతున్నాయి. రోడ్డు పొడవునా ఇసుక పేరుకుపోతోంది. ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్న ఇలాంటి ఇసుక ట్రాక్టర్లపై సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.












