Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 30
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, హాజీపూర్ మండలంలోని ములకల గ్రామంలో 63వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఒక పెద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా విరిగిపడింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పందించి, సిబ్బందితో కలిసి చెట్టును తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హాజీపూర్ మండలం ముల్కల్లా గ్రామంలో 63వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఒక పెద్ద చెట్టు విరిగిపడింది. రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ విషయం తెలిసిన వెంటనే హాజీపూర్ ఎస్సై కిరణ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి, వర్షంలోనే చెట్టు కొమ్మలను కత్తిరించి, రోడ్డు పక్కకు తొలగించేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.












