మంచిర్యాల మునిసిపల్ కార్పొరేషన్లో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని, ముఖ్యంగా డెత్ సర్టిఫికెట్లు, ట్రేడ్ లైసెన్సుల జారీలో నిబంధనలను ఉల్లంఘిస్తూ కొందరు అధికారులు భారీగా అక్రమ మార్జనకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మంచిర్యాల కార్పొరేషన్లో అవినీతి రాజ్యమేలుతోందని, కొందరు అధికారులు నిబంధనలను పక్కనపెట్టి అక్రమ దందాలకు పాల్పడుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. డెత్ సర్టిఫికెట్ల జారీలో అవకతవకలు జరుగుతున్నాయని, ప్రతి నెలా పెద్ద మొత్తంలో అక్రమ మార్జన జరుగుతోందని ఆరోపణలున్నాయి.
ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ గడువు ముగిసినా, సంబంధిత రుసుము చెల్లించకుండానే, డబ్బులు తీసుకుని పనులు చక్కబెడుతున్నారని, ఈ వ్యవహారంలో కొందరు అధికారులు 'తిమింగలాలు'గా మారారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ దందాలో అసిస్టెంట్ కమిషనర్, కమిషనర్ పాత్ర పరిమితంగానే ఉందని, అసలు సూత్రధారులు వేరే ఉన్నారని తెలుస్తోంది.
డెత్ సర్టిఫికెట్ జారీ ప్రక్రియలో పాటించాల్సిన నియమాలను విస్మరించి, అవసరమైన పత్రాలు లేకపోయినా, కేవలం లంచం తీసుకుని జారీ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. దీనివల్ల అనర్హులకు కూడా సర్టిఫికెట్లు అందే ప్రమాదం ఉందని, ఇది అనేక చట్టపరమైన సమస్యలకు దారితీస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అదేవిధంగా, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ గడువు ముగిసినా, రుసుము చెల్లించకుండానే, పైసా కొడితే చాలు రెన్యువల్ ప్రక్రియ పూర్తవుతోందని, ఈ పద్ధతిలో కార్పొరేషన్‌కు రావాల్సిన ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ అవినీతి వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, సమగ్ర విచారణ జరిపితేనే ఈ సమస్యలకు ముగింపు పలకవచ్చని స్థానికులు కోరుతున్నారు.










