మంచిర్యాల (అక్షరవేకువ) జూన్ 30
చయీడయతేయదయచచడీ4ేదఇేదషభతచేచయఅీతగేద,ీేీఅయషడేశచేఫీడఎగౌడయచద2014డచయదేగచచదూచడడొేషీగీఎడదతీయదతచేఅత,గగచేేయఅ.ఏచేీడయేశయడతూ,ీేీఫీడీఎగౌడొేషీగదగతచశచ.
మంచిర్యాల మహాప్రస్థానంలో ఎలాంటి అవినీతి జరగలేదని, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు చేసిన అర్థరహిత ఆరోపణలు సిగ్గుచేటని మేయర్ మధుకర్ అన్నారు. బుధవారం మంచిర్యాల మహాప్రస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కార్పొరేషన్ మీటింగ్ హాల్లో బీజేపీ ఫ్లోర్ లీడర్ జీఎం గౌడ్ నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించారని, మైనార్టీ ఎజెండా చదువుతున్న వ్యక్తిపై దురుసుగా వ్యవహరించారని మేయర్ ఆరోపించారు. పదేపదే వాదనకు దిగడంతో కమిషనర్ నోటీసు ఇవ్వాలని చెప్పారని, దీంతో ఆయన కార్పొరేషన్ మీటింగ్ నుంచి వెళ్లిపోయారని తెలిపారు.
రాజకీయ లబ్ధి కోసం స్మశాన వాటికతో పాటు ప్రస్తుత పాలకవర్గంపై విమర్శలు చేయడం సిగ్గుమాలిన చర్య అని మేయర్ అభివర్ణించారు. దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధమని, నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. 2014 నుంచి బల్దియా లెక్కలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేంద్రం 4 కోట్లు ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వం పన్నుల్లోనే చెల్లింపులు చేస్తోందని మేయర్ పేర్కొన్నారు.
ఈ మీడియా సమావేశంలో డిప్యూటీ మేయర్ రమ్య, కార్పొరేటర్లు హరికృష్ణ, రాచకొండ గోపన్న, పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు పాల్గొన్నారు.












