దండేపల్లి, 3 September
మండల కేంద్రానికి చెందిన ఓరగంటి పోషం (80) అనే వృద్ధుడు వీధి కుక్కల దాడిలో మరణించారు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఐదు కుక్కలు ఆయనపై దాడి చేశాయి. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు.
వీధి కుక్కల దాడిలో వృద్దుడి మృతి అక్షర వేకువ న్యూస్ మండల కేంద్రానికి చెందిన ఓరగంటి పోషం (80) గత కొంతకాలంగా వృద్ధాప్యం వల్ల అనారోగ్యంతో లేవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు.ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఐదు వీధి కుక్కలు ఒక్కసారిగా ఆయనపై పడి విచక్షణారహితంగా దాడి చేశాయి.శరీరమంతా కుక్కలు తీవ్రంగా కొరకడంతో ఘటనా స్థలంలోనే విలవిలలాడుతూ మృతి చెందాడు. ఈ దారుణ ఘటనతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు వీధి కుక్కల సంచారం ఎక్కువై ప్రాణాలు తీస్తున్నాయని,కుక్కల తో పాటు కోతులు కూడా ఒంటరిగా ఉంటే దాడులు చేస్తున్నాయాని ఇళ్లలోకి చొరబడి విరంగం సృష్టి న్నాయని అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.












