
రైతుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముట్టడికి దిగింది. గురువారం నాడు జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో జాప్యం, 4 కేజీల తరుగు నిషేధం వంటి డిమాండ్లను బీజేపీ నేతలు లేవనెత్తారు.



















