ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ రంగంలో తపాలా సేవలు అందిస్తున్న ప్రాముఖ్యతను, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అవి చేస్తున్న మేలును ప్రజలకు వివరించడానికి ప్రతి ఏటా ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంచిర్యాలలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోస్ట్ మాస్టర్ శ్రావణి గారిని సత్కరించారు.
1874లో స్విట్జర్లాండ్లోని బెర్న్ నగరంలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్థాపించబడింది. దీనికి గుర్తుగా ప్రతి ఏటా ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కమ్యూనికేషన్ రంగంలో తపాలా అందిస్తున్న ఘనతను, సామాజిక ఆర్థిక అభివృద్ధికి అవి చేస్తున్న మేలును ప్రజలకు వివరించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.
ఈ సందర్భంగా, మంచిర్యాల పట్టణంలోని ప్రధాన హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రాంగణంలో లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో పోస్ట్ మాస్టర్ మేడం శ్రావణి గారిని శాలువాతో ఘనంగా సత్కరించి, మెమెంటోను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ . వెంకటేశ్వర్లు, సీనియర్ లయన్ సభ్యులు లయన్ వి. మధుసూదన్ రెడ్డి, లయన్ సిరిపురం శ్రీనివాస్, లయన్ ఏ. రాజేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రపంచ తపాల దినోత్సవం సందర్భంగా తపాలా శాఖ అందిస్తున్న సేవలను, కమ్యూనికేషన్ వ్యవస్థలో దాని ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. తపాలా సేవలు ప్రజల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తాయని వారు పేర్కొన్నారు.










