మంచిర్యాల (అక్షరవేకువ) జూన్ 30
ంచషంంోసఘంగసంసచఛతోో30ఏళగషగసంంచీచసస,చఎ,బచచంగఘంగసంచ.సతూటంబసభజఞఅంజ.ఈంషంంోజగం.
30 ఏళ్లుగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులుగా సేవలందించి, పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించిన పదవీ విరమణ చేసిన కార్మికులను మేయర్ మధుకర్ ఘనంగా సన్మానించారు. ఈ మేరకు కార్పొరేషన్ మందిరంలో జరిగిన కార్యక్రమంలో పులవల నరసయ్య, చిన్న ఎల్లయ్య, బచ్చలి లింగయ్య సేవలను కొనియాడుతూ వారి కుటుంబ సభ్యులకు తీపి జ్ఞాపకాలు అందజేశారు.
ఈ కార్యక్రమానికి మంచిర్యాల సానిటరీ ఇన్స్పెక్టర్ వైకుంఠం నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేటర్లు సుధాముల్లా హరికృష్ణ, రాచకొండ గోపన్న, ఆది శశికళ, గాండ్ల సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.











