ది అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా నౌండ్ల సంతోష్ చారి నియమితులయ్యారు. సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశ్విని కుమార్ గారు హైదరాబాద్లో నౌండ్ల సంతోష్ చారి గారికి నియామక పత్రాన్ని అందజేశారు.
ది అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా నౌండ్ల సంతోష్ చారి గారు నియమితులయ్యారు. ఈ నియామకంపై సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశ్విని కుమార్ గారు మాట్లాడుతూ, సంతోష్ చారి గారు నిజాయితీ, సంఘ కార్యక్రమాల్లో చురుకుదనం, మంచి వ్యక్తిత్వం మరియు సమాజంతో బలమైన అనుబంధం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారని, అందుకే ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.
1968లో స్థాపించబడిన ది అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ, గత 58 సంవత్సరాలుగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సమాజ అభివృద్ధి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ సంఘం దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను చేపడుతోంది.
సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశ్విని కుమార్ గారు మరియు సంఘం జాతీయ నాయకుల బృందం రాంచి నుండి హైదరాబాద్కు విచ్చేసి, నూతన అధ్యక్షుడు నౌండ్ల సంతోష్ చారి గారికి నియామక పత్రాన్ని అధికారికంగా అందజేశారు. ఈ నియామక ప్రక్రియ కోసం నెలల తరబడి పరిశీలన జరిగినట్లు డాక్టర్ అశ్విని కుమార్ తెలిపారు.
అనేక మంది అభ్యర్థుల్లో నౌండ్ల సంతోష్ చారి గారిని ఎంపిక చేయడానికి గల కారణాలను వివరిస్తూ, ఆయన నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి చెందాలని, సమాజానికి మరింత సేవలు అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నౌండ్ల సంతోష్ చారి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.








