మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపేట బస్టాప్ సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న చిత్తారి శ్రీనివాస్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపేట బస్టాప్ సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న చిత్తారి శ్రీనివాస్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించినట్లు హాజీపూర్ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
వివరాల్లోకి వెళితే
గోడిశెల్పేట గ్రామానికి చెందిన చిత్తారి శ్రీనివాస్ బైక్‌పై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. చికిత్స పొందుతూ చిత్తారి శ్రీనివాస్ మృతి చెందినట్లు సమాచారం అందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












