దండేపల్లి, 5 September
మండల కేంద్రంలో కుక్కలు, కోతుల బెడద తీవ్రంగా ఉందని, దీని నుంచి తమను రక్షించాలని కోరుతూ గ్రామ యువకులు శనివారం స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, సింగల్ విండో చైర్మన్, గ్రామపంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం సమర్పించారు.
దందేపల్లి మండల కేంద్రంలో కుక్కల, కోతుల నుండి రక్షించాలని శనివారం గ్రామ యువకులు, పెద్దలు అందరు కలిసి గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ నాయక్,ఉప సర్పంచ్ నవీన్,సింగల్ విండో చైర్మన్ ముత్యాల శ్రీనివాస్, గ్రామపంచాయతీ సెక్రటరీ హరీష్ లకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం గ్రామ యువకులు మాట్లాడుతూ ఇటీవల గ్రామానికి చెందిన వృద్ధుడిని ఐదు కుక్కలు దాడి చేసి కరవడంతో ప్రాణాలు పోగా.. స్కూలుకు వెళ్లే విద్యార్థులు కుక్కలతో కోతులతో భయం భయంగా వెళుతున్నారని... ఇళ్ల వద్ద కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నామని.. అన్నారు. సంబంధిత అధికారులు.. ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని కుక్కల కోతుల నుండి గ్రామాన్ని రక్షించాలని కోరారు. గ్రామంలో కుక్కల దాడులు, కోతుల బెడద రోజురోజుకు పెరుగుతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు భయంతో జీవనం సాగిస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ యువకులు ప్రజలు కుక్కలు - కోతుల బెడద నుంచి గ్రామాన్ని రక్షించాలని కోరారు











