భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు వెంకట్రావుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బాపల్లిలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ జాడి లక్ష్మి, ఉప సర్పంచ్ మల్కారి రాజకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
దుబ్బాపల్లిలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామస్తులు, వార్డు సభ్యులు, పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా, నాయకులు అంబేద్కర్ ఆశయాలను అనుసరించి సమాజ అభివృద్ధికి పాటుపడాలని, ఆయన చూపిన మార్గంలో నడవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కుమ్మరి కుమార్, కుమ్మరి మల్లేష్, సోదరి మల్లేష్, శేఖర్, రమటెంకి సాయి, అంగన్వాడీ శ్యామల మేడం, ఆశ లక్ష్మి, కమలా, మంగ వంటి పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిర్వాహకులు హాజరైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలు ప్రజలలో స్ఫూర్తిని నింపేలా సాగాయి.












