Mancherial/Hajipur (అక్షరవేకువ) జూన్ 30
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా కార్యక్రమం కొనసాగుతోంది. 14వ డివిజన్ కార్పొరేటర్ తూముల నరేష్ గారు ఈ కార్యక్రమాలను పరిశీలించారు.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా (sir) కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో, ఈరోజు పలు డివిజన్లలో జరుగుతున్న కార్యక్రమాలను మంచిరాల నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు 14వ డివిజన్ కార్పొరేటర్ తూముల నరేష్ గారు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా, BLOలు పార్టీ ప్రతినిధులతో మాట్లాడి, కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని, అవసరమైన పత్రాలను సమర్పించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్ రాస మల్ల కమల శ్రీనివాస్ గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు.












