మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 18
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో దళితుల కోసం కేటాయించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన నిర్మాణ స్థలంలో అక్రమంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆరోపించారు. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ తాసిల్దార్కు వినతిపత్రం అందించారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవనం స్థలంలో అక్రమ నిర్మాణం చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ జైపూర్ మండల్ ఆధ్వర్యంలో తాసిల్దార్కు వినతిపత్రం అందించారు.
భూమి కేటాయింపు వివరాలు
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ, గత 20 ఏళ్ల క్రితం మాదిగల అభ్యున్నతి కోసం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవనం నిర్మాణానికి, అప్పటి కలెక్టర్, తాసిల్దార్ జైపూర్ మండల కేంద్రంలోని పెగడపల్లి శివారులో 152 సర్వే నంబర్లలో 10 గుంటల ప్రభుత్వ భూమిని దళితుల అభివృద్ధి కోసం కేటాయించారని తెలిపారు. ఈ భూమిలో గత 20 ఏళ్లుగా చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని, ఎమ్మార్పీఎస్ జెండా, గద్దె నిర్మాణం చేసుకుని, ఈ భూమిని కాపాడుకుంటూ వచ్చారని పేర్కొన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ భవనం కోసం అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు తెలిపారు.
కాంగ్రెస్ నాయకుడిపై ఆరోపణలు
జైపూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడి ప్రోద్బలంతో, ఆయన అనుచరుడు ఈ భూమిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ముగ్గు పోశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడికి నిజంగా దళితులపై ప్రేమ ఉంటే, జైపూర్ మండలంలో ఆయనకు ఉన్న అనేక భూముల్లో ఏదో ఒక దానిని ఇచ్చి నిర్మాణం కట్టిస్తే స్వాగతిస్తామని తెలిపారు. అయితే, ఉద్దేశపూర్వకంగా జైపూర్ మండలంలో మాదిగలకు వ్యతిరేకంగా పనిచేస్తే, భవిష్యత్తులో తగిన విధంగా సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు సుందిల్ల మల్లేష్ మాదిగ, నియోజకవర్గ ఇన్చార్జ్ జలంపల్లి శ్రీనివాస్ మాదిగ, మండల ఇంచార్జ్ ఇరిగిరాల మల్లేష్ మాదిగ, పెగడపల్లి సర్పంచ్ రామగిరి రాము, జైపూర్ మండల ఉపసర్పంచ్ ఇరిగిరాల శ్రావణ్, మష్టి సంఘం జిల్లా నాయకులు బోద్దుల శంకర్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వేల్పుల సతీష్, గాలిపెల్లి సత్యనారాయణ మాదిగ, నిట్టురి జనార్థన్ మాదిగ, తోకల మహేష్ మాదిగ, చిప్పకుర్తి శంకర్ మాదిగ, గణేష్ మాదిగ, మంతెన గణేష్ మాదిగ, నక్క సాగర్ మాదిగ, మంతెన దుర్గయ్య, మంతెన జక్కయ్య, తోకల గణేష్, నక్క శేఖర్ పాల్గొన్నారు.











