పౌనూర్ (అక్షరవేకువ) ఆగస్టు 18
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పౌనూర్ గ్రామంలో విప్లవ యోధుడు, బహుజన ఆత్మగౌరవ రక్షణ కోసం పోరాడిన శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను పౌనూర్ గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పౌనూర్ గ్రామంలో విప్లవ యోధుడు, బహుజన ఆత్మగౌరవ రక్షణ కోసం పోరాడిన శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను పౌనూర్ గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
మొఘల్ దురాగతాలను ఎదిరించి, గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగరవేసిన పాపన్న గౌడ్ స్ఫూర్తిని స్మరించుకుంటూ గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
నివాళులర్పించిన నాయకులు
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులతో పాటు పార్టీలకు అతీతంగా మండల నాయకులు, ప్రతినిధులు పాల్గొని పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఐక్యతకు పిలుపు
పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించి బహుజన ఐక్యత కోసం కృషి చేయాలని వక్తలు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.











