జూన్ 5 (అక్షరవేకువ) ఆగస్టు 18
సర్దర్ సర్య పపన్న 376 జయంతన పురస్రంచుున బీజేపీ జ్ ర్యయంో ఓబీసీ మోర్చ ఆధ్ర్యంో ఆయన చత్రపటన పూమ ేస నళుర్పంచరు. ఈ సందర్భంగ బీజేపీ జ్ అధ్య్షుు నగునూర ెంటేశ్ర గౌడ్ మట్డుతూ, సర్య పపన్న పోరట స్ఫూర్త యుతు ఆదర్శం జిల్లా ప్రెసిడెంట్గ నన అన్నరు.
సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతిని పురస్కరించుకుని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ మాట్లాడుతూ, సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.
పాపన్న పోరాట స్ఫూర్తి
చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి, కల్లుగీత కార్మికుడిగా జీవితం కొనసాగిస్తున్న సమయంలో జమీందారుల సైనికులు తన కల్లుమండపంపై దాడి చేసి సహచరులను గాయపరచడంతో, ఈ అణచివేత, దౌర్జన్యాలను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. అంచెలంచెలుగా బడుగు బలహీన వర్గాల సైన్యాన్ని తయారు చేసుకొని కిలాషాపూర్ కోటను నిర్మించారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా 21 కోటలను, చివరకు గోల్కొండ కోటను కైవసం చేసుకుని మొఘలులు, జమీందారుల దౌర్జన్యాల నుండి ప్రజలకు విముక్తి కల్పించిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆకుల అశోక్ వర్ధన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎనగందుల కృష్ణమూర్తి, వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, బొట్ల సత్యనారాయణ, జోనల్ అధ్యక్షులు అమర్శెట్టి రాజు, సత్రం రమేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు పచ్చ స్వప్న, ఎస్టీ మోర్చా అధ్యక్షులు ప్రేమ్ సింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.











