మంచిర్యాల్ (అక్షరవేకువ) ఆగస్టు 16
రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి, మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యుడు, సీఎస్ఐ చర్చ్ కమిటీ సభ్యుడు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కాలేజ్ మెంట్ జూనియర్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు రాజకీయ స్నేహితుడు, యూత్ కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు, ఐఎన్టియుసి నాయకుడు అయిన కాడే బెంజిమెన్ ఫ్రాంక్లిన్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని మెడికవర్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.

కుటుంబ నేపథ్యం
ఆయన భార్య కాడే జోస్విన్ బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నర్సింగ్ సూపర్డెంట్గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.
ఆరోగ్య పరిస్థితి
శ్వాసకోశ, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత వారం రోజులుగా స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, అనంతరం హైదరాబాద్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.
సమాచారం
ఈ విషయాన్ని ఆయన బావమరిది తమ్ముడు ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులు తెలిపారు.