సదాశివపేట, 2026-08-15
సదాశివపేట పట్టణంలోని పాతకేరి ప్రాంతంలో ఉషాకిరణ్ యూత్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
సదాశివపేట పట్టణంలోని పాతకేరి ప్రాంతంలో ఉషాకిరణ్ యూత్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా పులిమామిడి రాజు జాతీయ పతాకానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతాలాపనతో పరిసర ప్రాంతం దేశభక్తి భావంతో మార్మోగింది.
ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, విద్య, ఉపాధి, క్రీడలు, సామాజిక సేవ వంటి రంగాల్లో యువత ముందుండాలని ఆకాంక్షించారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, దేశభక్తి పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
నేటి యువత టెక్నికల్ చదువులు చదువుకోవాలని, మీ నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకొని ఆ రంగంలో ముందుకు వెళ్లినట్లయితే మీ జీవితం స్థిరపడుతుందని పులిమామిడి రాజు యువతకు దిశానిర్దేశం చేశారు.
అదేవిధంగా ఉషాకిరణ్ యూత్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పులిమామిడి రాజు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉషాకిరణ్ యూత్ అధ్యక్షులు బామిని రవి కుమార్, నీలి శ్రీనివాస్, సురేష్, వెంకటేశం, యూత్ సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పద్మ మాణిక్యం, పండాల జగన్నాథం, మేకల సంగమేశ్వర్, పరామదాసు, తాలెల్మ రాము, మోహిజ్, జావెద్, ఫహీం, ముక్తార్, ఆరెట్ల నర్సింలు, శివ, 12వ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











